కర్ణాటక రాష్ట్రంలో పానీపూరీ తనిఖీలు చేయగా కొన్ని సంచనల విషయాలు బయటపడ్డాయి. పానీ పూరీ శాంపిళ్లలో సన్‌సెట్ యోల్లో, బ్రిలియంట్ బ్లూ, కార్మోసిన్ రంగులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో వీటిని రాష్ట్రవ్యాప్తంగా నిషేధించే యోచనలో అధికారులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కృత్రిమ రంగుల వల్ల అలర్జీ, పిల్లల్లో హైపర్ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.