వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉత్తరం, తూర్పు దిశలో బూట్లు, చెప్పులు ఉంచవద్దు. ఈ దిశ లక్ష్మీ దేవికి చెందినది. కావున ఈ దిశలో పాదరక్షలు ఉంచితే ఇంటికి ప్రతికూల శక్తిని తెస్తుందని నమ్ముతారు. ఇలా చెప్పులు ఉంచిన వారిపై లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుందట. బూట్లు లేదా చెప్పులు క్లోజ్డ్ బాక్సుల్లో ఉంచాలి. మూసివున్న బాక్సులు ప్రతికూల భావోద్వేగాల నిర్మాణాన్ని నియంత్రిస్తాయి. ఇంటి తలుపు వద్ద బూట్లు, చెప్పులు ఉంచొద్దు. ఇవి ఇంట్లోని వ్యక్తుల మధ్య ఘర్షణకు దారితీస్తాయి. పడక గదిలో కూడా షూ రాక్‌ని పెట్టొద్దు.