వాస్తు శాస్త్రం ప్రకారం అదృష్టం కలగాలంటే కొన్నింటిని పాటించాలని పండితులు చెబుతున్నారు. ఉదయం నిద్ర లేవగానే తమ అర చేతులను చూసుకోవాలి. స్నానం చేసే సమయంలో నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేస్తే జాతకంలో దోషాలు తొలుగుతాయంటున్నారు. అలాగే మంగళవారం పంచముఖి హనుమంతుడి ముందు దీపం వెలిగించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ పోయి సానుకూలత వస్తుందని పేర్కొంటున్నారు.