రాత్రి పడుకునే ముందు కొన్ని పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందట. పౌర్ణమి రాత్రి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు. కాబట్టి ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. ఏ ఇల్లు శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీ దేవి నివసిస్తుందని నమ్ముతారు. పూజా స్థలంలో రాత్రిపూట నెయ్యి దీపం వెలిగించాలి. ఉత్తర దిశను కూడా శుభ్రంగా ఉంచాలి. చీపురుపై అడుగు పడకుండా చూడాలి. ఎక్కడైనా నేలపై అడ్డంగా ఉంచాలి. ఉదయం పూజకు వాడిన పూలు, పండ్లు, పూజా సామగ్రిని సంధ్యా హారతి సమయంలో తీసివేయాలి.