పర్వతాలపై ఔషధ మొక్కలు.. ఎక్కడో తెలుసా?

66చూసినవారు
పర్వతాలపై ఔషధ మొక్కలు.. ఎక్కడో తెలుసా?
బిహార్‌లోని గయలో ఉన్న బ్రహ్మయొని పర్వతంపై అనేకరకాల ఔషధ మొక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో గుర్మార్ అనే మొక్క కూడా ఉంది. మధుమేహాన్ని తగ్గించే లక్షణం దీనికి సొంతం. ఈ వ్యాధి చికిత్స కోసం బీజీఆర్-34 అనే ఔషధ తయారీకి శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) పరిశోధకులు గుర్మార్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ వనమూలికలు అంతరించిపోకుండా.. స్థానికుల సాయంతో వాటిని సాగుచేయించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్