ఏడు వారాల నగలు అంటే అర్థం తెలుసా?

553చూసినవారు
ఏడు వారాల నగలు అంటే అర్థం తెలుసా?
మనం అనేక సందర్భాల్లో ఏడువారాల నగల గురించి వినే ఉంటాం. అవేంటంటే. ఆదివారం సూర్యునికోసం హారాలు, కెంపులతో చేసిన జుంకాలు. సోమవారం చంద్రునికోసం ముత్యాల హారాలు, గాజులు. మంగళవారం కుజునికోసం పగడాలతో చేసిన గొలుసులు. బుధవారం బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు. గురువారం బృహస్పతి కోసం రంగు రాళ్లతో చేసిన కమ్మలు, ఉంగరాలు. శుక్రవారం శుక్రుని కోసం వజ్రాల హారాలు, ముక్కు పుడక. శనివారం శనిదేవునికై నీలమణిహారాలు.

సంబంధిత పోస్ట్