ఈ పెన్ను ధర ఎంతో తెలుసా?

566చూసినవారు
ఈ పెన్ను ధర ఎంతో తెలుసా?
పెన్ను అంటే ఎంత ధర ఉంటుంది? మంచి ఇంపోర్టెడ్ బ్రాండ్ పెన్నులు మహా అయితే రూ.500 ఉంటాయేమో. కానీ ఈ పెన్ను ధర ఏకంగా అక్షరాలా రూ.1.90 లక్షలు. మేగ్నాకార్ట్ అనే సంస్థ తయారుచేసిన ఈ పెన్ను, చెన్నై పెన్ షోలో అందర్నీ ఆకట్టుకుంటోంది. అందులోని కొన్ని విడిభాగాలను బంగారంతో తయారుచేయడమే ఆ రేటుకు కారణం. ఇక పెన్ను పెట్టే స్టాండ్‌పై సైతం శ్రీరాముడి విగ్రహం, గద, హారం వంటివాటిని ఏర్పాటు చేశారు.