కార్ల్ మార్క్స్ జర్మనీలోని ట్రీర్ అనే పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో 1818లో జన్మించాడు. మార్క్స్ బాన్, బెర్లిన్, జెనా విశ్వవిద్యాలయాలలో విద్యనభ్యసించాడు.1842లో మార్క్స్ ఒక పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. పత్రికా యాజమాన్యంతో వచ్చిన విభేదాలతో 1843లో తన బాధ్యతల నుంచి తప్పుకుని పారిస్ చేరుకున్నాడు. అక్కడ చరిత్ర, రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్రాలను అభ్యసించటంతో మార్క్స్‌లో సామ్యవాద భావాలు రూపుదిద్దుకున్నాయి.