కిడ్నీలో రాళ్ల సమస్య రావొద్దంటే కొబ్బరి నీళ్లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. బీపీ సమస్యతో బాధపడేవారికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి.