సమ్మక్క-సారక్కలకు బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే ఆ ప్రసాదాన్ని బెల్లం అనకుండా బంగారం అని పిలుస్తుంటారు. పూర్వం మేడారం జాతరను అడవి ప్రాంతంలో ఆదివాసీలు జరుపుకునే వారట. వారు బెల్లానికి ఎక్కువ విలువను ఇవ్వడంతో పాటు, ఖరీదైనదిగా భావించేవారట. ఈ క్రమంలోనే బెల్లాన్ని బంగారంగా పిలుచేవారని చాలామంది చెబుతుంటారు. కొంత మంది భక్తులు బెల్లం అని పిలిస్తే మంచి జరగదని కూడా అంటుంటారు.