నిజాం ప్రభువు భారత సైన్యానికి లొంగిపోయిన తర్వాత భూస్వాములు, పెత్తందారులు కాంగ్రెస్ టోపీలతో పునరావాసం పొంది ప్రజలను ఊచకోత కోశారు. దీంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం కొనసాగించారు. దీంతో భారత ప్రభుత్వం కమ్యూనిస్టులపై నిషేధం విధించింది. రెండు వారాల్లో తెలంగాణ పోరాటాన్ని అణచేస్తానన్న సర్దార్ పటేల్ గొప్పలు వమ్ము కాగా, 1951 అక్టోబరు 21 వరకూ ఈ సాయుధ పోరాటం కొనసాగింది. ఆ వెంటనే జరిగిన 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులు 14 స్థానాల్లో అఖండ విజయం సాధించారు.