ప్రపంచంలో అతి తక్కువ జననాల రేటు ఉన్న దేశం సౌత్ కొరియా. 2022 ప్రకారం సౌత్ కొరియాలో ఒక్కో మహిళకు సగటున పుట్టే పిల్లల సంఖ్య 0.78 కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 0.68కి పడిపోవచ్చని అంచనా. ఇప్పుడు ఆ దేశంలో బేబీ స్ట్రోలర్స్(43%) కంటే డాగ్ స్ట్రోలర్స్(57%) అధికంగా అమ్ముడవుతున్నాయి. దీన్ని బట్టి అక్కడ సంతానోత్పత్తి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. పిల్లులు, కుక్కలను పెంచుకునేవారి సంఖ్య 2012లో 3.6M ఉండగా, గత ఏడాది ఆ సంఖ్య 6Mకు చేరింది.