అతిగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవు: వైద్యులు

58చూసినవారు
అతిగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవు: వైద్యులు
అతిగా కాఫీ తీసుకోవడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుందని, దీనివల్ల ఒంట్లో నీటిశాతం తగ్గే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. అలాగే కాఫీలో ఉండే కెఫీన్ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుందని.. ఇది ఛాతీలో మంట, పులితేన్పుల వంటి సమస్యలకు దారితీయొచ్చని అంటున్నారు. దీనిలో ఉండే కెఫీన్ రక్తపోటు పెరిగేలా చేస్తుందని.. ఆహారంలోని క్యాల్షియంను శరీరం గ్రహించుకునే ప్రక్రియకి కెఫీన్ అడ్డు తగులుతుందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్