దుబాయ్ యువరాణి షేఖా లతీఫా ఎంఆర్ అల్ మక్తూమ్ తన తండ్రి, యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పట్ల తనకున్న ప్రేమను మరోసారి తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా శుక్రవారం అరబిక్ భాషలో ఒక ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ‘‘మీలాంటి వారు ఎవరూ లేరు నాన్న’’ అనే క్యాప్షన్‌తో మనసును హత్తుకునే ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. కాగా ఈ వీడియో తక్కువ సమయంలోనే వైరల్‌గా మారింది.