పండగ అంటే ప్రతి రోజూ జరిగేది కాదు. ఏడాదికి ఒక్కసారి వచ్చేది. ఏడాది అంతా గుర్తుంచుకునేలా చేసుకునేది. దీనికి వయసుతో పని లేదు, ప్రాంతంతో అంతకంటే సంబంధం లేదు. భారత్‌లోని అతి పెద్ద పండగల్లో ఒకటైన దసరా సందర్భంగా దేశమంతా వేడుకలు ఇలాగే జరుగుతాయి. నవరాత్రి రోజుల్లో జరిగే వేడుకలు ఒక ఎత్తైతే చివరి రోజైన దసరా రోజు జరిగే సంబరాలు మరో ఎత్తు. ఆ సేతు హిమచలం, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దసరా అంటే సందడే సందడి.