ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీంతో గుండెల్లో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అల్పాహారంలో బ్రెడ్, తీపి పదార్థాలు తినకూడదు. దీని వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇంకా ఖాళీ కడుపుతో కారం పదార్థాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.