పచ్చి చేపలు తినడం ప్రాణాంతకం

68చూసినవారు
పచ్చి చేపలు తినడం ప్రాణాంతకం
పచ్చి చేపలులో హానికరమైన పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు, వైరస్‌లు ఉంటాయి. చేప ప్రసాదం పేరుతో ఇచ్చేది చిన్నపాటి కొర్రమీను చేపపిల్లలే కాబట్టి వీటిలో సాల్మొనెల్లా, విబ్రియో, లిస్టేరియా వంటి బ్యాక్టీరియా ఫుల్లుగా ఉంటాయి. వీటిని తిన్న రెండు మూడు రోజులకు ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడవచ్చు. పచ్చి చేపలలో అనిసాకిస్, సూడోటెర్రానోవా, డిఫిలోబోథ్రియాసిస్ వంటి పరాన్నజీవులు కూడా ఉంటాయి. ఇవి వికారం, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలను కలిగిస్తాయి. కాబట్టి ఏ విధంగా చూసినా చేప ప్రసాదం పంపిణీ ఆరోగ్యానికి మంచిది కాదు.