రెమాల్ ప్రభావం.. కోల్‌కతా పోర్ట్ మూసివేత

55చూసినవారు
రెమాల్ ప్రభావం.. కోల్‌కతా పోర్ట్ మూసివేత
పశ్చిమ బెంగాల్ ను రెమాల్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాను ప్రభావంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతాలోని శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్టుని మూసివేయనున్నట్లు కోల్‌కతా పోర్ట్ చైర్మన్ రతేంద్ర రామన్ తెలిపారు. అన్ని కార్గో షిప్, కంటైనర్ సంబంధిత కార్యకలాపాలను ఆదివారం సాయంత్రం నుంచి 12 గంటల పాటు మూసేస్తామని, ఓడరేవులో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈనిర్ణయం తీసుకున్నామన్నారు.

ట్యాగ్స్ :