అమెరికా ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రతినెలా దాదాపు 45 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.376 కోట్లు) ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం వెల్లడించింది. తాజాగా ట్రంప్‌పై కాల్పుల ఘటనతో ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించిన మస్క్.. ఇప్పుడు మరోసారి విరాళాలందించేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.