జమ్ముకశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్లో మరోసారి ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముగ్గురు ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎవరికీ అపాయం సంభవించలేదు. అయితే ఆ ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుపెట్టాయి. ప్రస్తుతం బటాల్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీపావళి పండుగ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లో భద్రతా చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరపడం గమనార్హం.