పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

54చూసినవారు
పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పాకిస్థాన్‌ లష్కరే తోయిబాకు చెందిన అగ్రకమాండర్‌తో పాటు మరొక ఉగ్రవాది మృతి చెందాడు. నెహమా ప్రాంతంలో ఉగ్రవాదులు రహస్య స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందడంతో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని ఒక అధికారి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్