వీరాభిమానం.. సోనియా గాంధీకి పాలరాతి గుడి

72చూసినవారు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందని ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడి కట్టి అభిమానాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ నెవూరి మమత వెంకటరెడ్డి సోనియాకు పాలరాతి గుడిని నిర్మించారు. పాలరాతి గుడిని నిర్మించడంతో పాటు అందులో సోనియా చిత్రాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి గుడిని ఆవిష్కరించారు.