ఉత్తరప్రదేశ్ లోని చందౌలీలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు బాలిక ఇంట్లోకి ప్రవేశించి బాలికను రోడ్డుపై పడేసి ఘోరంగా కొట్టాడు. అనంతరం బాలిక తాతపై కూడా దాడి చేశాడు. దీంతో బాలిక తాతయ్య యువకుడిపై కర్ర తీసుకుని దాడికి దిగాడు . దీంతో యువకుడు భయంతో పారిపోయాడు. ఓ చిన్నపాటి వివాదంపై యువకుడు ఇంట్లోకి ప్రవేశించి బాలికను కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.