మన భారతీయ పురాణాల్లో ఎంతో మంది గురువులు ఉన్నారు. కానీ కొంతమందే చరిత్రలో నిలిచిపోయారు. వారిలో ద్రోణాచార్యుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు, వేద వ్యాసుడు, వశిష్ఠ మహర్షి, వాల్మీకి, శుక్రాచార్యుడు, బృహస్పతిలకు ప్రత్యేకమైన స్థానం కలదు. వీరందరూ జ్ఞానాన్ని, బోధనలను తమ శిష్యులకే కాదు, ప్రపంచానికే అందించారు. ఉపాధ్యాయులు ఎలా ఉండాలో వారిని చూసి నేర్చుకోవచ్చు.