ప్రస్తుత స్నేహాలు యాంత్రికతమవుతున్నాయి. కమ్యూనికేషన్ పెరిగినా కలుసుకోవడం అరుదు అవుతోంది. ప్రతిరోజు ఒకరికొకరు స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చాటింగ్‌లతోనే పలకరించుకుంటున్నారు. దీంతో నిత్యం స్నేహితులు ఒకరికొకరు కలుసుకోవడం ద్వారా కలిగే అపురూప అనుభూతిని దూరం చేసుకుంటున్నారు. అనుభూతి, భావోద్వేగాలపరంగా చూసుకున్నా..స్నేహాలు వర్ధిల్లాలంటే మిత్రులను కలవాలని మానసిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.