గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉజ్వల గ్రామంలోని ఓ రైతు పొలంలో 800 అడుగుల లోతున్న బోరుబావిలో అధిక పీడనం ఎక్కువ అవ్వడంతో మోటారు, పైపు రెండూ గాలికి పైకి ఎగిరిపోయాయి. మొత్తం పైప్‌లైన్‌తో పాటు బోర్‌వెల్ బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రైతన్న జర భద్రం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.