దేవరపై ఫ్యాన్‌ కామెంట్.. రామజోగయ్య శాస్త్రి కౌంటర్

72చూసినవారు
దేవరపై ఫ్యాన్‌ కామెంట్.. రామజోగయ్య శాస్త్రి కౌంటర్
దేవర మూవీ నుంచి ఈరోజు సాయంత్రం 5.04గంటలకు 'చుట్టమల్లె' పాట విడుదల కానుంది. ఎన్టీఆర్‌కు ఇలాంటి పాట వచ్చి చాలాకాలమైందని గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విటర్‌లో పేర్కొనగా ఓ నెటిజన్ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 'ఇంత హైప్ ఇస్తున్నారు. అంతలా లేకపోతే మీకు ఉంటుంది సార్' అని హెచ్చరించాడు. దీనిపై స్పందించిన శాస్త్రి 'హైప్ కాదు నిజం. సాయంత్రం మళ్లీ చెప్పు, ఇక్కడే ఉంటా' అని అతడికి కౌంటర్ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్