ప్రపంచ ప్రముఖుల ఫ్యాషన్‌ షో.. మస్క్‌ ట్వీట్‌ వైరల్(వీడియో)

51చూసినవారు
టెస్లా సీఈవో, ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ ఓ ఆసక్తికరమైన వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఇందులో ప్రపంచంలోనే ప్రముఖ నేతలు, టాప్‌ కంపెనీల అధినేతలు ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నట్లుగా ఉన్న వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోని సాంకేతిక పరిజ్ఞానమైన కృత్రిమ మేధతో రూపొందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ప్రధాని మోదీ, జో బైడెన్‌, కమలా హారిస్‌, డొనాల్డ్‌ ట్రంప్‌, జిన్‌పింగ్‌, మస్క్‌, బరాక్‌ ఒబామా వంటి ప్రముఖులు ర్యాంప్‌ వాక్‌ చేస్తూ కనిపించారు.

సంబంధిత పోస్ట్