దూడను దారుణంగా కరిచిన పిట్ బుల్ (వీడియో)

60చూసినవారు
ఓ గేదె దూడపై పిట్ బుల్ జాతికి చెందిన కుక్క దారుణంగా దాడి చేసి తీవ్రంగా కరిచింది. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఒక కుటుంబం తమ పెరట్లో కట్టివేసిన దూడపై పిట్ బుల్ అత్యంత కిరాతకంగా దాడి చేసింది. దాని ముఖాన్ని పట్టుకుపీకింది. దీంతో దూడ ముఖం నుంచి తీవ్ర రక్తస్రావం అయింది. పిట్ బుల్ లాంటి క్రూరమైన జాతుల కుక్కలను ఇంట్లో పెంచుకోకూడదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్