కేరళలోని ఇడుక్కిలో ఘోర ప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లి తిరిగివస్తుండగా సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు. 23 మంది క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతులను అరుణ్ హరి, రమా మోహన్, బిందు నారాయణన్, సంగీత్‌గా గుర్తించారు.