నేటి నుంచి హైడ్రా ప్రజావాణి ప్రారంభం

57చూసినవారు
నేటి నుంచి హైడ్రా ప్రజావాణి ప్రారంభం
హైడ్రా నేటి నుంచి ప్రజావాణి నిర్వహించనుంది. ఇకపై ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా హైడ్రా ప్రజావాణి కొనసాగనుంది. ప్రభుత్వ పార్కులు, స్థలాలు, చెరువులకు సంబంధించి ఆక్రమణలపై నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు . ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజావాణి జరుగుతుందని, మొదటగా వచ్చిన 50 మందికి టోకెన్స్ ఇచ్చి ఫిర్యాదులు స్వీకరిస్తామని రంగనాథ్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్