ఆగ్నేయ బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైవేపై ప్రయాణీకులతో వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో 38 మంది మరణించారు. మినాస్ గెరైస్ రాష్ట్రంలోని లాజిన్హా నగరానికి సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 9 మందిని ఆస్పత్రికి తరలించారు. టైరు పగిలిపోవడంతో బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. 2007 తర్వాత బ్రెజిలియన్ హైవేలపై జరిగిన ఘోర ప్రమాదంగా ఈ ఘటన నిలిచింది.