సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు మరిన్ని చర్యలకు సిద్దమవుతున్నారు. థియేటర్ యాజమాన్యానికి మరోసారి నోటీసులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా.. ఈ ఘటనలో పోలీసులు 12 లోపాలు గుర్తించారు. దీనిపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఈ నెల 12న థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయితే 10 రోజులు గడిచినా యాజమాన్యం స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.