ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

85చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
కర్ణాటకలోని సింధునూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. టైర్ ఊడిపోవడంతో కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురు కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం విద్యార్థులని తెలిసింది. హంపిలోని శ్రీనరహరి తీర్థుల బృందావనంలో పూజల కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్