ఎన్టీఆర్ ట్రస్ట్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కడాన్ని గౌరవంలా భావిస్తున్నట్టు సంగీత దర్శకుడు తమన్ చెప్పారు. తలసేమియా బాధితులకు అండగా నిలిచే లక్ష్యంతో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా ‘యుఫోరియా మ్యూజికల్ నైట్’ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో తమన్ మాట్లాడారు. ఫిబ్రవరి 15న ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నారు.