తమిళనాడులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాణిపేట జిల్లా వాలాజాపేటలో కర్ణాటక నుంచి వస్తున్న పర్యాటకుల బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. సుమారు 37 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే వేలూరులోని ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ఓం శక్తి మాత దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.