రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుపై లారీ పడటంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన బికనీర్ లోని దేశ్ నోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మహిళ సహా ఆరుగురు వ్యక్తులు తమ బంధువుల వివాహానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా.. లోడ్ తో వెళుతున్న భారీ ట్రాలీ వారిని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించి, కారుపై పడింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయి ఆరుగురు చనిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపట్టారు.