AP: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ గౌరవ సలహాదారులుగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని నియమించింది. స్పేస్ టెక్నాలజీకి ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్, డీఆర్డీవో మాజీ చీఫ్ సతీష్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్ల, కేపీసీ గాంధీలను కేబినెట్ హోదాతో సలహాదారులుగా నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేబినెట్ ర్యాంక్ హోదాతో రెండేళ్లు పదవిలో కొనసాగుతారని సర్కారు ఉత్తర్వులలో పేర్కొంది.