TG: జడ్చర్ల పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారును, లారీని ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీ కొనడంతో బస్సులోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. HYD నుండి అరుణాచలం వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగంగా ముందు వెళ్తున్న కారును ఢీకొని ఆ వెంటనే పక్కనే ఆగి ఉన్న మరో లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.