విద్యార్థిపై దాడి చేసిన తోటి విద్యార్థులు.. వీడియో వైరల్

58చూసినవారు
ఇటీవల విద్యార్థులు గొడవలు పడిన ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ క్యాంపస్ లో చోటు చేసుకుంది. ఒక విద్యార్థిపై 10 మందికి పైగా విద్యార్థుల బృందం దాడి చేసింది. కర్రలతో సదరు విద్యార్థిని దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్