ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై శనివారం అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల నుంచి బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించాల్సిన పని లేదని సీఎం స్పష్టం చేశారు.