టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. నేడు అతడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 52 ఏళ్ల కాంబ్లీ చికిత్సకు పూర్తిగా సహకరిస్తున్నారని వైద్యులు చెబుతున్నప్పటికీ.. పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యుల బృందం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. వినోద్ కాంబ్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.