తెలంగాణలో రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుతో సహా వివిధ కీలక అంశాలపై జనవరి 3న కేబినెట్ భేటీ నిర్వహించి చర్చించే అవకాశముంది. వీటితో పాటు పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనంతో సహా అన్ని శాఖల్లో ఉన్న పెండింగ్ అంశాలను మంత్రి వర్గం ముందుకు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. రైతు భరోసా మార్గదర్శకాలపై ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం చర్చించింది.