డేవిడ్‌, పోలార్డ్‌లకు మ్యాచ్ ఫీజులో ఫైన్‌

72చూసినవారు
డేవిడ్‌, పోలార్డ్‌లకు మ్యాచ్ ఫీజులో ఫైన్‌
ముంబై ఇండియ‌న్స్ బ్యాట‌ర్ టిమ్ డేవిడ్‌, బ్యాటింగ్ కోచ్ కీర‌న్ పొలార్డ్‌లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ వేశారు. ఏప్రిల్ 18వ తేదీన పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌‌లో ఆ ఇద్ద‌రూ ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఓ రివ్య్యూ విష‌యంలో బ్యాట‌ర్ సూర్య‌కుమార్‌కు అక్ర‌మ రీతిలో స‌హ‌క‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో వైర‌ల్ కావ‌డంతో డేవిడ్‌, పోలార్డ్‌ల‌కు జ‌రిమానా వేశారు.