పైప్ లైన్ పగిలి ఎగిసిపడుతున్న మంటలు (Video)

61చూసినవారు
అమెరికాలోని హ్యూస్టన్‌లో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. లా పోర్టె సిటీలో పైప్ లైన్ పగిలి మంటలు చెలరేగాయి. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 9:55 గంటల ప్రాంతంలో మంటలు మొదలయ్యాయి. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత గాలిలో మంటలు కనిపించాయని స్థానికులు చెప్పారు. విషయం తెలిసి వెంటనే స్పందించిన అధికారులు స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్