టర్కీలో ఘోర ప్రమాదం తప్పింది. ల్యాండింగ్ సమయంలో అజిముత్ ఎయిర్లైన్స్ నిర్వహిస్తున్న సుఖోయ్ సూపర్జెట్ 100 ప్యాసింజర్ విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. ఆదివారం టర్కీలోని అంటాల్య విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో 89 మంది ప్రయాణికులు ఉండగా.. అందరూ సూరక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.