ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతను సమీక్షించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని వస్తున్న వార్తలపై కేజ్రీవాల్ స్పందించారు. దేవుడిపై తనకు ఉన్న విశ్వాసమే తన ప్రాణాలను కాపాడుతుందన్నారు.