గుజరాత్‌లోని వడోదరాలో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఓ యువకుడు మద్యం మత్తులో కారును అతివేగంగా నడుపుతూ బైకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు డియోన్ టెక్నాలజీస్ కంపెనీ యజమాని కుమారుడిగా గుర్తించారు.