24 గంటలుగా.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి పోరాటం

66చూసినవారు
24 గంటలుగా.. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి పోరాటం
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి(M) రామేశ్వరంపల్లి గ్రామానికి చెందిన పల్లె శ్రీకాంత్ అనే యువకుడు పెళ్ళి చేసుకుంటానని నమ్మించి తనతో కలిసి తిరిగాడని ప్రియురాలు పల్లె కవిత ప్రియుడి ఇంటిముందు నిరసనకు దిగింది. నిన్నటి నుంచి ప్రియుడు శ్రీకాంత్ ఇంటి ముందు నిరసనకు దిగానని ఆమె వెల్లడించింది. మహిళలతో కలిసి టీ, వంటావార్పు కార్యక్రమం చేపట్టింది. ఇంతకుముందు వీరు పెళ్లిచేసుకోవడంతో మైనర్లు అని.. పెద్దయ్యాక పెళ్లిచేసుకోమ్మని పోలీసులు సూచించినట్లు తెలిపింది.

సంబంధిత పోస్ట్