పెళ్లయిన తర్వాత తొలిసారి సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుడికి అత్తమామలు 130 రకాల వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్ సరూర్ నగర్ సమీపంలోని శారదానగర్‌లో నివాసముంటున్న ఖమ్మంపాటి క్రాంతి, కల్పనా దంపతుల పెద్దమ్మాయి ఇందుకు కాకినాడకు చెందిన మల్లిఖార్జున్‌తో నాలుగు నెలల క్రితం వివాహం జరిపించారు. మొదటిసారి అల్లుడు అత్తారింటికి రావడంతో అతనికి 130 రకాల వంటలు చేసి వడ్డించారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.